ఎన్టీఆర్ ముస్లిం గెటప్.. ట్విస్ట్ పై కుండబద్దలు కొట్టిన రైటర్!


టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RRR సినిమాపై అంచనాలలు మరింత పెరుగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి కంటే ముందుగానే  ఆయన తండ్రి కథ రచయితే కె.విజయేంద్రప్రసాద్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ట్విస్టులను కూడా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు.

RRR లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను ముస్లిం గెటప్ లో చూపించడంపై ఓ వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఆ విషయంపై కూడా విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. “దీని వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.  అతన్ని హైదరాబాద్‌కు చెందిన నిజాం నవాబులు వెంబడిస్తారు.  కాబట్టి, అతను వాళ్ళ నుంచి  తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆ టైమ్ లో  అతను ముస్లిం బాలుడిగా కనిపిస్తాడు. ఆ సీన్స్ చాలా అర్థవంతంగా ఉంటాయి.. అని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.


Post a Comment

Previous Post Next Post