పుష్ప కోసం సన్నీ లియోన్?


సుకుమార్ సినిమా అనగానే ఆలోచింపజేసే స్క్రీన్ ప్లే సీన్స్ ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి. అందుకే రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు కూడా ఆయన మేకింగ్ కు ఫ్యాన్స్ అవుతుంటారు. ఇక సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ను సినిమాకు తగ్గట్లుగా ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఇక ఐటెమ్ సాంగ్స్ అనే పదానికి సరికొత్త అర్దాన్ని తీసుకువచ్చిన సుకుమార్ దేవిశ్రీప్రసాద్ తో ఈసారి మరింత డిఫరెంట్ సాంగ్ ను క్రియేట్ చేయిమ్చబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీ పుష్ప ఐటెమ్ సాంగ్ కోసం ఈసారి సన్నీ లియోన్ ను దింపుతున్నట్లు టాక్ వస్తోంది. ఏకంగా 50లక్షల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post