రెండో పెళ్లికి సిద్ధమైన సుమంత్!


అక్కినేని మేనల్లుడు సుమంత్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో తొలిప్రేమ(1998) హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  2004 లో ప్రేమించి పెళ్లి చెలుకున్న వారు కొన్ని కారణాల వల్ల 2006 లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి కూడా సుమంత్ సోలోగానే ఉంటున్నాడు.

ఆ మధ్య పెళ్లికి సిద్దమైనట్లు టాక్ వచ్చింది గాని అందులో ఎలాంటి నిజం లేదని సుమంత్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇక ఫైనల్ గా అతను ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అమ్మాయి దగ్గరి బంధువే అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సుమంత్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఒక సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటి ఇవ్వనున్నాడు.

Post a Comment

Previous Post Next Post