మినీ బాక్సాఫీస్ ఫైట్.. తేడా వస్తే కష్టమే!


చాలా రోజుల అనంతరం మళ్ళీ సినిమాల హడావుడి మొదలు కాబోతోంది. అంతే కాకుండా ఈ కరోనా టైమ్ లో జనాల ఆలోచన ఎలా ఉందో కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ శుక్రవారం 5 సినిమాలు థియేట్రికల్ గా విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే అందులో రెండు సినిమాలు తప్పితే మిగతా వాటిపై పెద్దగా అంచనాలు లేవు.

సత్య దేవ్ యొక్క తిమ్మరుసు, తేజ సజ్జా ఇష్క్ సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులలో హైప్ అయితే క్రియేట్ చేశాయి. పాజిటివ్ టాక్ వస్తేనే ఈ సినిమాలకు నార్మల్ ఆడియెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా ఈ కఠిన సమయంలో నష్టాలు తప్పవు. 
 నరసింహపురం, త్రయం,  పరిగెత్తు పరిగెత్తు.. అనే మరో మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. కానీ వీటిపై ఎలాంటి బజ్ లేదు. మరి ఈ 5 సినిమాల్లో ఏ సినిమా క్లిక్కవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post