అప్పుడే రూ.కోటి లాగుతున్న ఉప్పెన బ్యూటీ!


ఉప్పెన సినిమాతో అలా హిట్టు కొట్టిందో లేదో కృతి శెట్టి దశ మొత్తం తిరిగిపోతోంది. వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. రెండు పదుల వయసులోకి రాకముందే అమ్మడు కోట్ల రూపాయల్లో ఆదాయాన్ని అందుకుంటోంది. ఇక బుల్లితెరపై కూడా బ్యూటి మంచి ఆదాయాన్ని అందుకుంటోంది. ఏకంగా జీ తెలుగు కోసం ప్రత్యేకంగా చేసిన యాడ్ కు హయ్యెస్ట్ పేమెంట్ అందుకున్నట్లు సమాచారం.

ఉప్పెన సినిమాకు 20లక్షలు మాత్రమే తీసుకున్న బేబమ్మ జీ తెలుగు యాడ్ కోసం ఏకంగా 1కోటి రూపాయల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. జీ తెలుగు ఇటీవల కాలంలో ప్రోగ్రామ్స్, టీవీ సీరియల్స్ అంటూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను క్రియేట్ చేస్తోంది. ఇక వాటిని ప్రమోట్ చేసే క్రమంలో కృతి శెట్టి ద్వారా ఒక చిన్న యాడ్ ను షూట్ చేశారు. అందుకోసం ఆమెకు కోటి రూపాయలు ఇచ్చేశారు. ధీంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం కీర్తి రామ్, సుధీర్ బాబు, నాని వంటి వారితో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది.


Post a Comment

Previous Post Next Post