ప్రముఖ నటి జయంతి కన్నుమూత - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

ప్రముఖ నటి జయంతి కన్నుమూత


500కు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి పలు అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న జయంతి సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. జయంతి మృతిపట్ల సౌత్ సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు.

జయంతి మృతితో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి 1963లో ‘జెనుగూడు’ అనే కన్నడ సినిమా ద్వారా నటిగా కెరీర్ ను స్టార్ట్ చేశారు. అనంతరం తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో  నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి అగ్రకథానాయకులతో కలిసి నటించారు. 'కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’ వంటి సినిమాల్లో కూడా ఆమె చేసిన ప్రత్యేకమైన పాత్రలు అప్పట్లో మంచి గుర్తింపుని అంధించాయి.