మహేష్ - రాజమౌళి కోసం పుస్తకాలు తిరగేస్తున్న రైటర్!


ఆర్‌ఆర్‌ఆర్ విడుదలైన తర్వాత  రాజమౌలి మరో భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం కోసం మహేష్ బాబుతో చేతులు కలపనున్న విషయం తెలిసిందే.  రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆఫ్రికా అడవుల్లో సాహసోపేతమైన థ్రిల్లర్ సెట్లో మహేష్ బాబును సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. 

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ మరోసారి మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజమౌళితో ఇంకా కథ ఆలోచనపై పనిచేస్తున్నానని వెల్లడించిన విజయేంద్ర ప్రసాద్, దక్షిణాఫ్రికాకు చెందిన రచయిత విల్బర్ స్మిత్ రచనలను కూడా ప్రేరణగా తీసుకుంటున్నట్లు చెప్పారు. భారీ కాన్వాస్ ఉన్న కథను రాయడానికి స్మిత్ పుస్తకాలను చదవడం ద్వారా ప్రస్తుతం పరిశోధనలో ఉన్నానని చెప్పారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును సీనియర్ టాలీవుడ్ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. 2022 లో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాలని భావిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post