జాతిరత్నాలు డైరెక్టర్ కోసం స్టార్ హీరోయిన్?


జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అనుదీప్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫరెంట్ కామెడీ జానర్ తో సాలీడ్ హిట్ అందుకోవడంతో అతనితో వర్క్ చేసేందుకు స్టార్స్ కొందరు సిద్ధంగా ఉన్నారు. ఇక స్వప్న సినిమాస్ లోనే మరో డీలింగ్ సెట్ చేసుకున్న అనుదీప్ స్టార్ క్యాస్ట్ ను దింపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే శివ కార్తికేయన్ హీరోగా సెట్టయినట్లు టాక్ అయితే వస్తోంది. అంతే కాకుండా హీరోయిన్ గా రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లు మరో న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు బాలీవుడ్ లో రెండు బడా సినిమాలు చేస్తున్న రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిన్న సినిమా కూడా చేస్తోంది. ఇక జాతిరత్నాలు దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ కామెడీ ఫిల్మ్ గా రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post