సంక్రాంతి రిలీజ్ డేట్స్.. F3 నలిగిపోతుందేమో?


సంక్రాంతి అనగానే బాక్సాఫీస్ వద్ద యుద్ధాలు జరగడం కామన్. పెద్ద సినిమాలు వచ్చినా కూడా కొన్ని చిన్న సినిమాలు ఏ మాత్రం భయపడకుండా ప్రేక్షకుల ముందుకి వస్తుంటాయి. ఇక 2022 సంక్రాంతికి నాలుగు పెద్ద హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇక ఈ పోటీలో F3 నిలవడం కష్టమేమో అని టాక్ వస్తోంది.

2019లో F2 వచ్చినప్పుడు వినాయవిధేయ రామ, పేట, కథానాయకుడు సినిమాలు వచ్చాయి. లక్కీగా ఆ సినిమాలేవి క్లిక్కవ్వలేదు. ఇక F2 ఎదో ఫ్లోలో ఆడేసింది అనే కామెంట్స్ ఇప్పటికి వస్తుంటాయి. ఇక 2022 సంక్రాంతికి కూడా అలాంటి అదృష్టమే కలిసొస్తుందని అనుకుంటే కష్టమే. జనవరి 10 పవన్ రానా - జనవరి 12 సర్కారు వారి పాట - జనవరి 13 బీస్ట్ - జనవరి 14 రాధేశ్యామ్ - జనవరి 15న F3 రవచ్చట. ఈ రేసులో లో రాధేశ్యామ్ డేట్ అయితే ఫిక్స్ అయ్యింది. బీస్ట్ - F3 సినిమాలు వస్తే కాస్త రిస్క్ చేసినట్లే. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post