మహేష్ కోసం త్రిష..నిజమేనా?


మహేష్ బాబు - త్రిష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ గట్టిగానే వస్తోంది. అప్పుడెప్పుడో అతడు, సైనికుడు సినిమాల్లో కలిసి నటించిన వీరు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం ఒకటయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సెట్టయితే హీరోయిన్ పాత్ర కోసం అయ్యిండకపోవచ్చు.

నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న త్రిషతో మహేష్ జోడి అంటే తట్టుకోవడం కష్టమే. ఇక త్రివిక్రమ్ కూడా అలాంటి ప్రయోగాలు చేయడు. కానీ ప్రతి సినిమాలో మెయిన్ హీరోయిన్ తో పాటు సెకండ్ హీరోయిన్ ను అలాగే సీనియర్ హీరోయిన్స్ ను హైలెట్ చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి త్రిషకు ఏదైనా స్పెషల్ రోల్ ఆఫర్ చేసి ఉండవచ్చు. మరి ఆ స్పెషల్ రోల్ ఏమిటో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post