మరో హీరో కోసం అల్లరి నరేష్ స్పెషల్ రోల్!


మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కెరీర్ ను స్టార్ట్ చేసి 15 ఏళ్లకు పైగానే అయింది. కానీ ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్బ్ చూడలేదు. ఎలాంటి సినిమాలు చేసిన కూడా కెరీర్ కు యూటర్న్ ఇచ్చేంత విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని అహం బ్రహ్మాస్మి సినిమా తో రెడీ అవుతున్నాడు. సినిమా కోసం మనోజ్ చాలా కష్టపడుతున్నాడు సొంత ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్న ఆ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. నరేష్ మంచు మనోజ్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. దాదాపు ఇద్దరి కెరీర్ ఒకేసారి మొదలయ్యాయి. అల్లరి నరేష్ మహర్షి సినిమాలో మహేష్ స్నేహితుడిగా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అహం బ్రహ్మస్మి సినిమాలో మంచు మనోజ్ కోసం ఒక చిన్న రోల్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించబోతున్నాడట. మరి ఆ పాత్ర సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అల్లరి నరేష్ సభకు నమస్కారం అనే సినిమాను చేస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post