మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్న మాస్ రాజా!


మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. దాదాపు కెరీర్ క్లోజ్ అయ్యే రేంజ్ లో లో డిజాస్టర్స్ చూసిన రవితేజ మళ్లీ క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం కిలాడి సినిమాలు చేసే పనిలో బిజీగా ఉన్న మాస్ రాజా ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇటీవల తమిళ డైరెక్టర్ శరత్ తో రామారావు అనే సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక కిలాడి సినిమా అయిపోగానే మరొక సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. చలో, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుమలతో మరొక సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. కథపై ఫుల్ నమ్మకంతో ఉన్న మాస్ రాజా త్వరలోనే అఫిషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నడు. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post