విజయ్ తో మహేంద్ర సింగ్ ధోని!!


ఒకరేమో క్రికెట్ లో సూపర్ హీరో మరొకరేమో సినిమాల్లో సూపర్ హీరో, మరి ఆ ఇద్దరు దిగ్గజ వ్యక్తులు ఒక్కసారి కలిసితె నిజంగా అది అద్భుతం అనే చెప్పాలి. మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ విషయం మరెవరి గురించో కాదండి, ఇండియన్ టీమ్ కి ఎన్నేళ్ళగానో కలలా మిగిలిపోయిన వరల్డ్ కప్ ని తన నేతృత్వంలో అందించి తన మార్క్ బ్యాటింగ్, హెలికాఫ్టర్ షాట్స్ తో కోట్లాది మంది ప్రేక్షకాభిమానులని మెప్పించిన భారతీయ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని, అలానే కోలీవుడ్ లో ఇలయతలపతి గా బాక్సాఫీస్ రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయిన విజయ్ దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులకు అందరికీ ఎంతో సుపరిచితం. ఆయన నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

ప్రస్తుతం తన తదుపరి సినిమా బీస్ట్ మూవీ కి సంబంధించి చెన్నై లోని గోకులం స్టూడియోస్ లో జరుగుతున్న షూట్ లో పాల్గొంటున్న విజయ్ ని అక్కడే ఒకయాడ్ ఫిలిం షూట్ జరుగుతుండగా మధ్యలో విరామ సమయంలో నేడు విజయ్ ని ఎమ్ ఎస్ ధోని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరు సూపర్ హీరోలు గతంలో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకమారు చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే నేడు వీరిద్దరి కలయికతో ఒక్కసారిగా గోకులం స్టూడియోస్ పులకరించిపోగా ప్రస్తుత వారిద్దరూ కలిసి ముచ్చటించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. నిజంగా ఈ ఇద్దరు సూపర్ హీరోలని ఒకే ఫ్రేమ్ లో చూడడం ఎంతో ఆనంద పరవశంగా ఉందని అంటున్నారు ఫ్యాన్స్... మరి ఎంతైనా ఇద్దరూ ఇద్దరేనబ్బా ... !!

Post a Comment

Previous Post Next Post