నిన్న సూపర్ ఫ్యాన్స్ ... రేపు పవర్ ఫ్యాన్స్ హవా!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఆగష్టు 9న తన 46వ జన్మదినాన్ని పురస్కరించుకుని తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట నుండి బ్లాస్టర్ పేరుతో ఫస్ట్ లుక్ టీజర్ ని ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా అందించిన విషయం తెలిసిందే. సూపర్ ఫ్యాన్స్ తో పాటు దాదాపుగా ఆడియన్స్ అందరినీ కూడా ఆ టీజర్ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఈ టీజర్ 30 మిలియన్ కి పైగా వ్యూస్ తో దుమ్మురేపుతూ దూసుకెళుతోంది. పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక దీనితో పాటు నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు చేయనున్న మూవీ తాలూకు టీమ్ అనౌన్స్ మెంట్ వీడియో కూడా విడుదలైంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి కూడా థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వీటిలో సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి విడుదల కానుండగా త్రివిక్రమ్ మూవీ నవంబర్ లో ప్రారంభము అయి, వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక మహేష్ తరువాత రాబోయే సెప్టెంబర్ నెల 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఏకంగా మూడు అప్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారట ఆయా సినిమాల దర్శక నిర్మాతలు. కాగా వాటిలో అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ నుండి ఫస్ట్ లుక్ టీజర్ రానుండగా, హరిహర వీరమల్లు నుండి ఒక కీలక న్యూస్ అలానే తదుపరి హరీష్ శంకర్ తో పవన్ చేయనున్న లేటెస్ట్ మూవీ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ కూడా ఉండనున్నట్లు టాక్ ... !!


Post a Comment

Previous Post Next Post