రవితేజకు మరో ఓటీటీ ఆఫర్?


ఇటీవల గోపీచంద్ మలినేని తీసిన క్రాక్ మూవీతో భారీ సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా మంచి ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల్లో ముందుగా ఖిలాడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ప్రముఖ వోటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వారు, ఒక ప్రముఖ స్టార్ దర్శకుడు తెరకెక్కించనున్న భారీ యాక్షన్ వెబ్ సిరీస్ కోసం హీరో రవితేజ ని సంప్రదించారట. 

అయితే ఆ స్టోరీ నచ్చి చేయడానికి ఒప్పుకున్న రవితేజ, భారీ రెమ్యునరేష్ డిమాండ్ చేసినట్లు టాక్. కాగా రవితేజ భారీ డిమాండ్ తో కొంత ఆలోచనలో పడ్డ అమెజాన్ ప్రైమ్ వారు ఆయన స్థానంలో సైఫ్ అలీ ఖాన్, మాధవన్ వంటి నటులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి మాస్ రాజా కాస్త తగ్గి అమెజాన్ వాళ్ళ డీల్ కి ఒప్పుకుంటారా లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post