మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా!


అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఆ తరువాత మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. బాలీవుడ్ లోనే అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇక బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఆ తరువాత సందీప్ తెలుగులోనే మరొక సినిమా చేయాలని అనుకున్నాడు.

మహేష్ బాబుకు ఒక యాక్షన్ కథను కూడా చెప్పాడు. అయితే స్క్రిప్ట్ మొత్తం మహేష్ అంతగా నచ్చలేదని అందుకే మహేష్ రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో ఒక టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ స్పెస్ లో దర్శకుడు సందీప్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇదివరకే మహేష్ బాబుతో స్క్రిప్ట్ గురించి చర్చించడం జరిగింది. సరైన ప్లానింగ్ తో మొత్తం సెట్టయినప్పుడు సరైన సమయంలోనే ఆ సినిమా సెట్స్ పైకి రావచ్చని కూడా నమ్మకం వ్యక్తం చేశాడు.


Post a Comment

Previous Post Next Post