మెగాస్టార్ చిరంజీవితో కామెడీ డైరెక్టర్?


ఆరు పదుల వయసులో ఉన్న కూడా మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం అలసిపోకుండా యువ హీరోల తరహాలో సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేసిన మెగాస్టార్ అనంతరం మరో రెండు సినిమాలను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

లూసిఫర్ రీమేక్ తో పాటు బాబి దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమా కూడా అదే ఏడాది పట్టాలెక్కించాలని రెడీ అవుతున్నారు. ఇటీవల మారుతితో కూడా కొత్త సినిమా చేయాలని మెగాస్టార్ ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. వరుస కామెడీ సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న మారుతి ఇంతవరకు బడా స్టార్స్ తో సినిమాలు చేయలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపు రావడంతో కొత్త తరహా కథలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. సినిమాలో మంచి సందేశంతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్ తగ్గట్టుగా సీన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నడట. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే కనుక వచ్చే ఏడాది సెట్స్ పైకి రావచ్చని సమాచారం


Post a Comment

Previous Post Next Post