పుష్ప హిందీ ఆఫర్స్.. టెంప్ట్ అవ్వని మైత్రి!


క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ సినిమా పుష్ప ఈ ఏడాది డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.  భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ టాలీవుడ్ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు హిందీ ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సంబంధించిన విషయాలు లీక్ అయ్యాయి. అల్లు అర్జున్ కి ఇది మొదటి పాన్ సినిమా అయినప్పటికీ హిందీలో భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సంస్థకు హిందీ నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం. సినిమా హిందీ రిలీజ్ హక్కుల  కోసం భారీగా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు ఇప్పుడే టెంప్ట్ అవ్వకుండా మొదటి సాంగ్ వచ్చిన తర్వాత ఆఫర్స్ పై చర్చలు జరుపుతున్నారట. సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అనుకుంటున్నారు. మరి ఆ ఆలోచన విధానం సినిమా బిజినెస్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post