పవన్ కోసం బండ్ల గణేష్ న్యూ టార్గెట్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి బడా నిర్మతల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. అడ్వాన్స్ ఇవ్వడానికి రేడిగానే ఉన్నారు. అయితే తన టైమింగ్ ను అర్థం చేసుకొని వర్క్ చేసేవారే కావాలని పవన్ చాలా దగ్గరి వారికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు అంటే చాలా కష్టమైన పని.

అవసరం అయితే షెడ్యూల్ కు బ్రేకప్ చెప్పినా చెప్పవచ్చు. అందుకే అర్థం చేసుకునే నిర్మాతలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ అనంతరం తన అభిమాన హీరోతో మరొక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బండ్ల గణేష్ సరైన కథ కోసం వేయుట్ చేస్తున్నాడు. ఇక పవన్ మరో 5 నెలల్లో ఏకే రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అనంతరం హరీష్ శంకర్ సినిమా ఉంటుంది. సురేందర్ తో కూడా ఒకటి చేయాలి. ఇక ఆ లైనప్ లోనే బండ్ల గణేష్ సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక బండ్ల గణేష్ మరో 5 నెలల్లో పవర్ స్టార్ రేంజ్ కు తగ్గ స్టోరీని సెట్ చేయాలని చూస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post