రామ్ చరణ్ - UV కాంబో.. మళ్ళీ కుర్ర దర్శకుడేనా?


టాలీవుడ్ మెగా ప్రొడక్షన్ లలో ఒకటైన UV క్రియేషన్స్ మొదట్లోనే పెద్ద సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంది. ఇక మెల్లగా మీడియం రేంజ్ హీరోలు ,చిన్న హీరోలతో కూడా బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడం స్టార్ట్ చేశారు. ఇక వారితో వర్క్ చేయాలని మిగతా అగ్ర హీరోలు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ తో కూడా యూవీ క్రియేషన్స్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. వారితో కూడా సినిమా చేస్తానని ఎప్పుడో మాట ఇచ్చాడు. ఇక పాన్ ఇండియా రేంజ్ కు రావడంతో యూవీ క్రియేషన్స్ కూడా పెద్ద సినిమానే నిర్మించాలని అనుకుంటోంది. ఇక సాహో సుజిత్ తోనే రామ్ చరణ్ కు కథ వినిపించాలని అనుకుంటున్నారట. ఇదివరకే లూసిఫర్ చేసే అవకాశం వచ్చినప్పటికీ సుజిత్ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. మరి ఈసారి రామ్ చరణ్ ను ఎంతవరకు ఒప్పిస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post