మహేష్ బాబు - సుకుమార్ మీటింగ్.. ఫోటో వైరల్!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ను కలవడం హాట్బ్ టాపిక్ గా మారింది. గతంలో వన్ నేనొక్కడినే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కాంబినేషన్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ను అందుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోసారి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల దర్శకుడు సుకుమార్ మహేష్ బాబును ఒక యాడ్ షూటింగ్ లో ఉండగా స్పెషల్ కలుసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగిన ఆ యాడ్ షూట్ లో ఎందుకు కలిశారో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ మాట్లాడుకుంటున్నా ఫోటో ఒకటి ఇంటర్నెట్ వరల్డ్ లో లీక్ అయ్యింది. ప్రేక్షకుల కోరిక మేరకు మరోసారి కలిసి సినిమా చేస్తారో లేదో చూడాలి. ఇక దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే మహేష్ బాబు - పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post