10 మంది టాలీవుడ్ హీరోలతో 1000కోట్ల బిజినెస్?


సంక్రాంతికి మూడు సినిమలైతే ఫిక్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ - రానా నటిస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ జనవరి 12, మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13, ప్రభాస్ రాధే శ్యామ్ జనవరి 14న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నలుగురు హీరోలే బాక్సాఫీస్ వద్ద ఈజీగా 700కోట్ల వరకు మార్కెట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

ఇక మరికొన్ని సినిమాలు కూడా స సంక్రాంతిని టార్గెట్ చేశాయి. వెంకటేష్ - వరుణ్ తేజ్ F3 సినిమాతో పాటు నాగార్జున - నాగచైతన్య బంగార్రాజు కూడా అదే సమయంలో రావచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ ఆచార్య కూడా సంక్రాంతి లేదా జనవరిలో ఎప్పుడైనా రావచ్చని మరొక టాక్ వస్తోంది. ఈ విధంగా మొత్తం 10 మంది టాలీవుడ్ హీరోలతో సంక్రాంతి జనవరిలో 1000కోట్ల బిజినెస్ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విడుదల తేదిలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post