టక్ జగదీష్ - లవ్ స్టొరీ.. మళ్ళీ రావా?


టక్ జగదీష్ - లవ్ స్టొరీ.. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇక మూడోసారి కూడా జంప్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు అయితే గట్టిగానే పెరుగుతున్నాయి. మళ్ళీ రానున్న రోజులు ఎలా ఉంటాయో తెలియదు. 

సాదారణ ఆడియెన్స్ విషయాన్ని పక్కన పెడితే అసలు ఫ్యామిలీ ఆడియెన్స్ రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు. దానికి తోడు ఆంద్రప్రదేశ్ లో థియేటర్స్ టికెట్స్ రేట్స్ పై నిర్మాతలు సంతృప్తిగా అయితే లేరు. అందుకే టక్ జగదీష్ - లవ్ స్టొరీ మరో నెల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. లవ్ స్టొరీ అయితే సెప్టెంబర్ 10 అంటున్నారు గాని పరిస్థితులు అనుకూలిస్తే తప్ప ఆ సినిమా వచ్చే ఛాన్స్ లేదు. టక్ జగదీష్ కూడా అదే తరహాలో ఆలోచిస్తోంది. ఈ రెండు సినిమాలకు ఓటీటీలో డబుల్ ప్రాఫిట్స్ వచ్చేలా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఒప్పుకోవడం లేదు.

Post a Comment

Previous Post Next Post