ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మొత్తనికి తెలుగులో మరొక సీజన్ ను స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ 5 తెలుగులోకి మరోసారి హీరో నాగార్జున షో హోస్ట్‌గా తిరిగి వచ్చాడు. మొత్తం 19 మంది పోటీదారులు ఫైనల్‌లో గ్రాండ్ ప్రైజ్‌తో వైదొలగడానికి ఒకరితో ఒకరు పోరాడుతున్నారు.
స్టార్ మా ఛానెల్‌లో 100 రోజుల పోరులో ఏవరు పైచేయి సాధిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక 19 మంది కంటెస్టెంట్స్ కూడా ఆదివారం గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ ఎంట్రీ ఎపిసోడ్ కోసం షో నిర్వాహకులు దాదాపు రూ.2.50కోట్లను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మొదటిరోజు షణ్ముక్ జశ్వంత్ పేరు ఎక్కువగా వైరల్ అయ్యింది. చూస్తుంటే అతనికి ఈసారి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కలే అవకాశం ఉంది.
Follow @TBO_Updates
Post a Comment