సీటిమార్ ఎవరు రిజెక్ట్ చేశారంటే..?


సంపత్ నంది గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా సిటీ మార్ పై అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. క్రాక్ తర్వాత మళ్ళీ ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఈనెల 10న విజయ వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకునే అవకాశం అయితే ఉంది. గౌతమ్ నంద తర్వాత ఈ కాంబో చేస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం.

అయితే సిటీ మార్ కథను దర్శకుడు సంపత్ నంది ఇది వారికే కొంత మంది హీరోలకు వినిపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక యంగ్ ఎనర్జిటిక్ హీరోకు సీటిమార్ కథను చెప్పినట్లు తెలియజేశాడు. అయితే ఆ కథ తన వయసుకు సెట్టవ్వదని ఓపెన్ గానా చెప్పేశాడట. దర్శకుడు కూడా అదే తరహాలో ఆలోచించి మళ్ళీ గోపి చంద్ కు తగ్గట్టుగా ఈ కథను సెట్ చేసినట్లు చెప్పాడు. ఇక  రిజెక్ట్ చేసిన హీరో మరెవరో కాదు. రామ్ పోతినేని అని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కు కూడా ఈ కథను చెప్పమని చాలామంది అన్నారట. కాని దర్శకుడు మాత్రం రామ్ చరణ్ ను ఒక కోచ్ పాత్రలో ఉహీంచుకోలేకపోయాను అంటూ భవిష్యత్తులో తప్పకుండా మరొక రచ్చ లాంటి సినిమా చేస్తానని వివరణ ఇచ్చాడు.


Post a Comment

Previous Post Next Post