కృతి శెట్టి అడిగినంత పారితోషికం.. బంగార్రాజు డైరెక్టర్ కామెంట్!


ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లగా తన స్థాయిని పెంచుకుంటున్న కృతి శెట్టి రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఉప్పెన రిలీజ్ కంటే ముందే శ్యామ్ సింగరాయ్ తో పాటు బంగార్రాజు ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ మొత్తానికి మార్కెట్ లో ఇప్పుడు కోటి కి పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆమెకు అడిగినంత ఇవ్వడానికి కారణం ఏమిటి అనే విషయంపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎవరైనా సరే వారి సక్సెస్ రేంజ్ మార్కెట్ కు తగ్గట్టుగా డిమాండ్ చేస్తారు కాబట్టి అదే కొనసాగుతుంది. ఇక ఈ సినిమాలో నాగలక్ష్మి అనే పాత్రకు ఆమె పర్ఫెక్ట్ కాబట్టి ఆమె డిమాండ్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఉప్పెన విడుదల కంటే వారం రోజుల ముందు బంగార్రాజు కథ చెప్పడం జరిగింది. ఒకవేల అంతకుముందు రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకొని ఉండి ఉంటే కొంత తగ్గి ఉండేదని కళ్యాణ్ కృష్ణ తెలియజేశాడు.

Post a Comment

Previous Post Next Post