అక్కినేని హీరోపై బోయపాటి ఫోకస్?


అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను నెక్స్ట్ ఎవరిపై ఫోకస్ చేస్తాడు అనేది ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ పేరు అయితే గట్టిగానే వినిపిస్తోంది గాని ఆ విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు.

అల్లు అర్జున్ - బోయపాటి కాంబో మాత్రం మరోసారి ఉంటుందని పక్కాగా సమాచారం అందుతోంది. అయితే బన్నీ కంటే ముందు బోయపాటి మరో హీరోతో వర్క్ చేసే అవకాశం ఉందట. ఇక ఆయన చూపు ఇటీవల అక్కినేని అఖిల్ పై పడినట్లు తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం తన 5వ సినిమా ఏజెంట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక అఖిల్ 6వ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందట. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post