డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న అనంతరం. పాన్ ఇండియన్ సినిమా లైగర్ ను విజయ్ దేవరకొండతో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ గా లైగర్ చిత్రీకరణను కూడా ముగించాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
లైగర్ అనంతరం తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన కథను పూరి కనెక్ట్స్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో చేయబోతున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందట. ఇక జనగణమన తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు మరో టాక్ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ప్రస్తుతానికి వెల్లడించనప్పటికీ, అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా కూడా పూరి కనెక్ట్స్ లో సినిమాను రూపొందిస్తారట. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాధ్ ఈ సినిమాలన్నింటినీ నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేసిన పూరి జగన్నాధ్ వచ్చే ఏడాది వాటి కోసమే బిజీ అవ్వనున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment