'DJ Tillu' Movie @ Review


కథ:
బాల గంగాధర్ తిలక్ DJ టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)  మధ్యతరగతి యువకుడు. DJ ప్లేయర్ గా మంచి గుర్తింపు అందుకున్న అతను ప్రొఫెషనల్ సింగర్ అయిన రాధిక (నేహా శెట్టి)తో ఒక రిలేషన్షిప్ మొదలవుతుంది. అనంతరం టిల్లు ఆమె కారణంగా అనేక రకాల సమస్యలను సవాళ్ళను ఎదుర్కొంటారు. అలాగే మర్డర్ కేసు కూడా అనేక రకాల ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక  రాధికను కష్టాల నుంచి తప్పించుడానికి టిల్లు ఎలా సహాయపడాతాడు? అసలు టీజే టిల్లు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నాడు? అనేది వెండితెరపై చూడాలి.

విశ్లేషణ:
దర్శకుడు విమల్‌కృష్ణతో హీరో సిద్దు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సహకారాన్ని అందించాడు. కాన్సెప్ట్ ప్రారంభం నుండి పాత్రలో అతను చాలా నిమగ్నమై నటించాడు. సిద్దు పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్ కు సెట్టయ్యే విధంగా పర్ఫెక్ట్ కథను అయితే డిజైన్ చేసుకున్నట్లు చెప్పవచ్చు. 
మొదటి ప్రమోషన్ నుంచే, DJ టిల్లు పాత్ర, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి.  సిద్ధూపై ఒక అంచనా సృష్టించింది. DJ టిల్లు రిఫ్రెష్ ప్లాట్ కంటెంట్, ఒక రేసీ స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా తీశారు. ఫస్ట్ హాఫ్ మొదట్లోనే  ప్రేక్షకులను టిల్లు క్యారెక్టర్ సినిమాల్లోకి చాలా ఈజీగా లాగేస్తుంది. పాటలు కూడా జోష్ ఇవ్వడంతో ఆడియెన్స్ సినిమాల్లోకి వెళ్లిపోతారు.

ప్రమాదవశాత్తూ ఒక హత్యకు సంబంధించిన సస్పెన్స్ డ్రామాలో హీరో హీరోయిన్ ట్రాక్ కొత్తగా ఉంటుంది. వారు ఎవరికి చిక్కకుండా ప్రయత్నం చేసే క్రమంలో ఒక ప్రొఫెషనల్ తాగుబోతు (నర్రా శ్రీను), క్లబ్ యజమాని (ప్రిన్స్ సెసిల్) ఒక పోలీసు అధికారి (బ్రహ్మాజీ) వెంబడిస్తుంటారు.  ఈ ట్రాక్ లో మంచి ఎంటర్‌టైన్మెంట్ అయితే క్రియేట్ అయ్యింది. కాకపోతే కోని సన్నివేశాలు ఓవరాక్షన్ అనేలా కథకు అడ్డం పడుతుంటాయి.

అయితే ఈ సినిమాకు టైటిల్ కాస్త విబేధం ఉంటుంది. క్రైమ్ కామేడి తరహా సినిమాకు ఆ టైటిల్ ఎందుకు సెట్ చేశారు అనే ఆలోచన రాకుండా ఉండదు. కేవలం ఆడియెన్స్ ను థియేటర్స్ లోకి లాగేందుకే ఆలోచించారని అనిపిస్తోంది. ఇక కథాంశం ప్రకారం డీజే టిల్లు ఓ వర్గం ఆడియెన్స్ నుంచి మంచి క్రేజ్ ను అందుకుంటుంది.
దర్శకుడు విమల్ కృష్ణ తొలి ఎపిసోడ్‌లలో యూత్ ఎలిమెంట్స్‌ని కరెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ అసలైన స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త క్లూలెస్‌గా  ఉన్నాడని అనిపిస్తుంది. 

ప్రగతిని న్యాయమూర్తిగా కోర్టు ఎపిసోడ్‌లు హాస్యాస్పదంగా చూపించడం ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చెప్పడం కష్టమే.  సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాటలు ఇప్పటికే మంచి హిట్ కాగా, రెండు పాటల పిక్చరైజేషన్ బాగుంది.  తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొదటి సగంలో DJ థీమ్‌కి సరిపోతుంది. కానీ సెకండాఫ్‌లో చాలా లౌడ్ గా విసుగు తెప్పిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ చాలా వరకు కూల్‌ గా ఉన్నాడు.  రాధికగా నేహా శెట్టి చాలా యావరేజ్ క్యారెక్టర్.  ప్రిన్స్ పాత్ర అంతగా కనెక్ట్ అవ్వలేడు.   బ్రహ్మాజీ, నర్రా శ్రీను పాత్రలు పూర్తి స్థాయిలో నవ్వు తెప్పించలేకపోయాయి. ఫైనల్ గా కొన్ని ఎపిసోడ్స్ తో పరవాలేదు అనిపించే విధంగా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ ఉంది.

ప్లస్ పాయింట్స్:
👉సిద్ధు డీజే టిల్లు క్యారెక్టర్
👉డైలాగ్స్
 👉సంగీతం
 👉థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
👉 ఫస్ట్ హాఫ్

 నెగిటివ్ పాయింట్స్
 👉సెకండ్ హాఫ్ బోరింగ్ సీన్స్
 👉ప్రీ క్లైమాక్స్ 
 
రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post