Khiladi Movie @ Review


కథ:
గాంధీ (రవితేజ) ఒక ఫ్యామిలీలో ఉండగా అతను ఒకేసారి 10,000 కోట్ల విలువైన మనీలాండరింగ్ కేసులో చిక్కుంటాడు. ఇక అతను అరెస్ట్ అయిన అనంతరం  మీనాక్షి చౌదరి సైకాలజీ విద్యార్థిగా అతనిపై పరీక్ష చేయగా ఆమెకు అతని గురించి పలు విషయాలు తెలుస్తాయి. ఇక గాంధీ బయటకు రాగానే అందరికి పెద్ద షాక్ ఇస్తాడు.  ఆ షాక్ ఏంటి?  అసలు గాంధీ అంటే ఎవరు?  మరియు అతనికి 10,000 కోట్లతో సంబంధం ఏమిటి?  సమాధానాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ పై  చూడాల్సిందే.


విశ్లేషణ:
ఖిలాడీ ట్రైలర్ చూడగానే ఇది పక్కా హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అని అందరు అనుకున్నారు. ఇక సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్లు అనిపించింది. ముఖ్యంగా ఖిలాడీలో మంచి సపోర్టింగ్ క్యాస్ట్‌తో నిండి ఉంది. ప్రతి పాత్రకు నటనకు మంచి స్కోప్ ఉంటుంది అని అందరు అనుకున్నారు. కానీ సినిమా చూసిన తరువాత మాత్రం కథాంశం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్లే కూడా అంత కొత్తగా ఏమి లేదు. దర్శకుడు పనితనం ఏమిటో తరువాత సీన్ లోనే ఈజీగా ఊహీంచవచ్చు అనేలా ఉంది.

చిత్రం ముగింపు దశకు వచ్చేసరికి అనేక మలుపులు తిరుగుతుంది. ట్విస్ట్‌లు అయితే చాలానే ఉన్నాయి కానీ ఆడియెన్స్ ఓపికకు పరీక్ష పెట్టేలా చిరాకుగా ఉన్నాయి. భారీ బడ్జెట్ ఛేజ్ సీక్వెన్స్‌ లతో సినిమా లుక్ కాస్త చేంజ్ అయ్యింది.  ఇక రవితేజ పాత్రలో హడావుడి బాగానే చేసినప్పటికీ సినిమా మొత్తంలో అతనిలో ఏదో డల్ నెస్ కనిపిస్తోంది అనిపించకుండా ఉండదు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో అయితే గతంలో మాదిరిగా రవితేజ మెప్పించలేదు. హీరో పాత్రను సెకనులో చెడు నుండి మంచిగా మర్చడంతో అంత కిక్కేమి ఉండదు.

ఇక డింపుల్ హయాతి క్యారెక్టర్ కాస్త హైలెట్ అయ్యింది. సినిమాలో ఆమె గ్లామర్ షో జనాలకు బాగా నచ్చుతుంది.  
మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కథకు మేయిన్ లీడ్ గా బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోతో రొమాన్స్ బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక ఖిలాడిలో అనసూయ పాత్ర ట్విస్ట్‌ ఇచ్చింది కానీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ లో అసలు కొత్తదనం ఏమి లేదు. యాక్షన్ కింగ్, అర్జున్ పోలీస్ పాత్రలో బాగా నటించాడు. రవితేజతో ఫైట్ సీన్ కూడా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ లో అయినా ట్విస్ట్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తారని అనుకుంటే అక్కడ కూడా కూడా తేడా కొట్టేసింది. కేవలం అక్కడక్కడా సీన్స్ మాత్రమే కాస్త వర్కౌట్ అయ్యాయి. DSP సంగీతం బాగుంది అలాగే BGM కూడా బాగుంది.  రెండు మాస్ పాటలు ‘అట్టాసూడకే’ ‘క్యాచ్ మీ క్యాచ్ మీ' వర్కౌట్ అయ్యాయి. మరికొన్ని పాటలు స్పీడ్ బ్రేకర్స్ లా అనిపించినా, వాటిని బాగా చిత్రీకరించారు.  

డైరెక్టర్ రమేష్ వర్మ విషయానికి వస్తే, అతను సినిమాతో అనుకున్నంతగా మెప్పించలేదు.  ఫస్ట్ హాఫ్ లో సినిమా మొదట్లో కొంత బాగా నేరేట్ చేసిన ఆయన కథ ముందుకు సాగుతున్న కొద్దీ నిరాశపరిచే విధంగా స్క్రీన్ ప్లేతో నిరాశపరిచాడు అనిపిస్తుంది. సినిమా యొక్క క్యాప్షన్‌ ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ గు తగ్గట్టుగా వర్కౌట్ కాలేదు. ఘోరంగా విఫలమయ్యాడు.  సెకండాఫ్‌లో అతని కథనంలో ఎటువంటి సీరియస్‌నెస్ లేదు. మరి అభిమానులు ఈ సినిమాకు ఎంతవరకు ఎట్రాక్ట్ అవుతారో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉యాక్షన్ సీక్వెన్స్
👉ప్రముఖ నటీనటులు

మైనెస్ పాయింట్స్:
👉ఉహించే ట్విస్టులు
👉స్క్రీన్ ప్లే
👉ప్రధాన పాత్రల రొటీన్ యాక్టింగ్

ఫైనల్ గా.. రొటీన్ ఖిలాడి

రేటింగ్: 2.25/5

Post a Comment

Previous Post Next Post