శర్వానంద్ రెమ్యునరేషన్.. ఇచ్చింది తీసుకోకుండా..?


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోల్లో మంచి పారితోషికం అందుకుంటున్న వారిలో శర్వానంద్ ఒకరు. అయితే గత కొంతకాలంగా వరుస అపజయాలు ఎదురవడంతో అతనితో సినిమా చేసేందుకు కొంత మంది నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు మంచి హీరో అయినప్పటికీ అతని సక్సెస్ రేటు చాలా వరకు తగ్గుతూ వస్తోంది.

ఇక ఇప్పుడు శర్వానంద్ చేస్తున్న కొత్త ప్రాజెక్టులకు నిర్మాతలు పారితోషికం ఇవ్వడం లేదట. సక్సెస్ రేటు లేకపోయినా కూడా శర్వానంద్ ఒకే తరహాలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో శర్వానంద్ ఇచ్చింది తీసుకోకుండా సినిమా విడుదల తర్వాత లాభాల్లో వాటా ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు కూడా అదే తరహాలో డీల్ సెట్ అయిందట. మరి ఆ సినిమా ఏ స్థాయిలో లాభాలు అందిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post