రాజమౌళి ఆయుధాలు.. ఈసారి RRRలో ఏ ఆయుధం ఉందంటే?


దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తప్పకుండా డిఫరెంట్ ఆయుధాలు అనేవి ఉంటాయి. సింహాద్రి సినిమా నుంచి చూసుకుంటే ఆయుధాల విధానం ఎంత ప్రత్యేకంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. అలాగే ఛత్రపతి విక్రమార్కుడులో ఇక మర్యాద రామన్న సైకిల్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటన్నిటి వేలంలో వేసి ఆ వచ్చిన డబ్బుతో రాజమౌళి అప్పట్లో కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఉపయోగించారు.

ఇక ఇప్పుడు RRR సినిమా లో ఎలాంటి ఆయుధం ఉంటుంది అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆ ప్రశ్నపై సమాధానమిచ్చాడు. ఈ సినిమాలో ఉండే ఒకే ఒక్క ఆయుధం అన్ని పాత్రలతో కనెక్ట్ అయి ఉంటుంది అని, అది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే అని చాలా డిఫరెంట్ గా చెప్పాడు. సినిమా లో ఉండే ఎమోషన్ అనే ఆయుధం ప్రతి ఒక్క క్యారెక్టర్ తో డ్రైవ్ అవుతుంది అని.. సినిమాకు అంతకంటే గొప్ప ఆయుధం మరొకటి అవసరం లేదు అని వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post