సర్కారు వారి పాట సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ SSMB28 సినిమాతో బిజీగా కానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో మహేష్ బాబు లేకుండానే ప్రాజెక్టును లాంచ్ చేసిన త్రివిక్రమ్ ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ముందుగానే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ పై కూడా ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
సినిమా షూటింగ్ ఇదే ఏడాది నవంబర్లో పూర్తి చేయాలి అని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. ఇక సినిమా షెడ్యూల్ లో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తే అనుకున్న సమయానికి విడుదల చేయవచ్చు అని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారట. 2023 జనవరి 6వ తేదీన త్రివిక్రమ్ మహేష్ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ప్లాన్ తగ్గట్టుగానే సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తాడో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment