కిరణ్ అబ్బవరం.. టైర్ 2 ఎంట్రీ కి సిద్దం!


పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ లైనప్ తో ముందుకు సాగుతున్నాడు. యంగ్ & టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం మొదట 'రాజా వారు రాణి గారు'తో అరంగేట్రం చేసి జెట్ స్పీడ్ లో ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యాడు. అనంతరం 'ఎస్ఆర్ కళ్యాణమండపం'తో మరింత క్రేజ్ అందుకున్నాడు.

'సెబాస్టియన్ పిసి 524' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా తన నటన కి మంచి  మార్కులు పడ్డాయి. ఇక కిరణ్ జూన్ 24న 'సమ్మతమే' అనే మరో విభిన్నమైన సినిమాతో రాబోతున్నాడు. మరో చిత్రం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' కూడా ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఆ తరువాత 'GA2 పిక్చర్స్' - 'మైత్రి మూవీ మేకర్స్' ఇలా పెద్ద బ్యానర్లలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. ఇవే కాకుండా ఏఎమ్ రత్నం, ఏషియన్ సునీల్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. 

ఇ లయినప్ లో ఏ  రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టినా కూడా కిరణ్ టైర్ 2 కి ఎంటర్ అవుతాడని చెప్పవచ్చు. పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో టాలెంట్ తో తన తోటి హీరోల కంటే చాలా ఫాస్ట్ గా ముందుకు దూసుకుపోతున్నడు.

Post a Comment

Previous Post Next Post