అమ్ముడుపోయిన బిగ్ బాస్.. భలే గిరాకీ!


బిగ్ బాస్ లో పాల్గొనాలని సెలబ్రెటీగా మరో స్థాయికి ఎదగాలని ఇండస్ట్రీలో చాలామందికి ఉంటుంది. ఇక క్యాష్ పార్టీల్లో పుట్టి పెరిగిన వారికి బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకోవాలని మోజు కూడా గట్టిగానే ఉంటుంది. ఇక ఈసారి నాన్ స్టాప్ షోలో పాల్గొన్న వారిలో సగం మందికి పైగా డబ్బులు ఇచ్చి వచ్చినవారని తెలుస్తోంది.

ముఖ్యంగా టాప్ 5 పొజిషన్ కోసం కూడా ఒక క్యాష్ పార్టీ ముద్దుగుమ్మ భారీగా డబ్బులు ఇచ్చి మరీ హౌస్ లో ఉన్నట్లు సమాచారం. ఆమె ఇన్ని రోజులు అసలు హౌస్ లో  ఎందుకు ఉందొ ఎవరికి అర్థం కాలేదు. బిగ్ బాస్ లో అడుగు పెట్టె వరకు కూడా జనాలకు ఆమె ఎవరో తెలియదు. అసలు ఆమె గేమ్ ఆడటం కంటే అరవడమే ఎక్కువ. విన్నర్ అయ్యే అర్హత లేదని ఆమెకు కూడా తెలుసు. ఇక అందుకే టాప్ 5లో ఉండేందుకు ఆమె బేరం కుదర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రూట్లో బిగ్ బాస్ కు ఈ సీజన్ వల్ల డబ్బులు ఇవ్వడం కంటే తీసుకోవడం ఎక్కువట. ఒక విధంగా భలే గిరాకీ జరిగినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post