విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లైగర్ సినిమాను పూర్తి చేసిన విజయ్ మళ్ళీ పూరి జగన్నాథ్ తోనే జనగణమన అనే మరో ప్రాజెక్ట్ ను కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఖుషి సినిమాను స్టార్ట్ చేశాడు.
అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ నిర్మాత ఇటీవల V దర్శకుడిని విజయ్ కోసం కథను సెట్ చేయించినట్లు టాక్. కథపై విజయ్ పాజిటివ్ గానే స్పందించినట్లు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి మంచి దర్శకుడే అయినప్పటికీ అతని చివరగా డైరెక్ట్ చేసిన V సినిమా ఓటీటీలో కూడా డిజాస్టర్ టాక్ ను సోంతం చేసుకుంది. చిన్న సినిమాల వరకే అతని మ్యాజిక్ వర్కౌట్ అవుతోంది. మరి విజయ్ తో ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment