Type Here to Get Search Results !

Sarkaru Vaari Paata @ Review


కథ
ఆమె తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) నుండి అప్పు వసూలు చేయడానికి ఇండియాకు వెళతాడు.  అయితే ఈ క్రమంలో మహేష్ మరో పెద్ద సమస్య గురించి తెలుసుకుంటాడు. కొందరు మిడిల్ క్లాస్ జనాల కోసం పోరాడేందుకు సిద్ధమవుతాడు. ఇక ఆర్థిక కుంభకోణాల్లో ఇమిడి ఉన్న తెరవెనుక రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఆ తరువాత మహేష్ ఎదుర్కొన్న సవాల్ ఏమిటి? అనేది తెరపై చూడాలి. 

విశ్లేషణ
చిన్న వయసులోనే అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న మహేష్ తల్లిదండ్రులకు సంబంధించిన ఎమోషనల్ సీన్స్ తో సినిమా మొదలవుతుంది. అనంతరం కట్ చేస్తే మహేష్ ఒక పెరున్న ఫైనాన్స్ కంపెనీలో అప్పులు ఇచ్చే వ్యక్తిగా కొనసాగడం మరొక విభిన్నమైన అంశం. ఏ కారణంగా అయితే హీరో తల్లిదండ్రుల ఆత్మహత్య చేసుకున్నారో మళ్ళీ అదే దారిలో మహేష్ పాత్ర కొనసాగడం ఆసక్తిని రేపే అంశం. మహేష్ పాత్ర ఈ సినిమాలో ఉహీంచినట్లే డిఫరెంట్ టైమింగ్ తో కొనసాగుతుంది. ఒక విధంగా అతను వన్ మ్యాన్ షో చేశాడు అని చెప్పవచ్చు.   

కామెడీ ఎమోషనల్ డ్రామా యాక్షన్ ఇలా అన్ని రకాల సీన్స్ లో దర్శకుడు పరశురామ్ మహేష్ ను ఒక పర్ఫెక్ట్ మీటర్ లో ప్రజెంట్ చేశాడు. ఇక కీర్తి సురేష్ పాత్ర జూదానికి బానిసైన ఆకతాయి పాత్ర.  డబ్బు అవసరం ఉన్న సమయంలో చదువుకునే విద్యార్థిగా నటిస్తూ, రుణం కోసం మహేష్‌ కు దగ్గరవుతుంది. ఇక ఆమె గురించి చాల తొందరగానే తెలుసుకున్న మహేష్ షాక్ అవ్వడం ఆ ఎపిసోడ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ మహేష్, కళావతి, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తో ముందుకి సాగుతుంది.

కీర్తి సురేష్ చేసిన అప్పు కోసం ఇండియా వరకు వెళ్లిన మహేష్ అక్కడ ఆమె తండ్రి నుంచి మరో సవాల్ ఎదుర్కొంటారు. సెకండ్ హాఫ్ లో మిడిల్ క్లాస్ జనాలకు సంబంధించిన ఒక సమస్య గురించి కూడా తెలుసుకున్న హీరో దాని కోసం పోరాడే ప్రయత్నం బాగానే ఉంది. అయితే ఆ పాయింట్ ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది అనిపించింది. దర్శకుడు పరశురామ్ డైలాగ్స్ విషయంలో తన పవర్ ఏమిటో మరోసారి చూపించారు. సెకండ్ హాఫ్ క్లయిమ్యాక్స్ లో డైలాగ్స్ జనాలకు కనెక్ట్ అయ్యేలా ట్రై చేశారు. కానీ అక్కడ డ్రామా ఎక్కువయ్యింది. 


సినిమా ఫస్ట్ హాఫ్ మహేష్ బాబు ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్‌తో తగినంత వినోదాత్మకంగా ఉంటుంది.  సెకండాఫ్ చాలా ఫ్లాట్ నేరేషన్ తో ఎండ్ అవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లోని ‘పెన్నీ పెన్నీ’, ‘కళావతి’ అనే రెండు పాటలు, సెకండాఫ్‌లోని చివరి పాట ‘మా మ మహేశా’ని బాగా హైలెట్ చేశారు. పాటలన్నీ మహేష్ అభిమానులకు నచ్చేస్తాయి. అయితే ఇక థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అంచనాలకు తగినంతగా ఏమి లేదు. ఆర్.మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక రామ్ లక్ష్మణ్ ఫైట్లు ఈసారి అంతగా వర్కౌట్ అవ్వలేదు. రొటీన్ కమర్షియల్ ఫైట్లు మహేష్ ఫ్యాన్స్ అంచనాలకు అందుకునే అవకాశం లేదు. కేవలం ఫస్ట్ హాఫ్ బీచ్ ఫైట్ VFX వర్క్ పరవాలేదు అనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్
👉మహేష్ కామెడీ టైమింగ్, క్యారెక్టర్ డిజైనింగ్
👉ఫస్ట్ హాఫ్ 
👉సాంగ్స్ విజువల్స్

మైనస్ పాయింట్స్
👉సెకండ్ హాఫ్
👉స్టోరీ


ఫైనల్ గా..
పక్కా కమర్షియల్ మాస్ సినిమాగా సర్కారు వారి పాటను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ బ్యాంక్ మోసాలకు సంబంధించిన ఒక పాయింట్ ను ఇంకా కనెక్ట్ అయ్యే రేంజ్ లో చూపించాల్సింది. ఏదేమైమా కామెడీ సాంగ్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్.. మహేష్ ఫ్యాన్స్ కు అయితే చూడదగిన సినిమా అని చెప్పవచ్చు.

రేటింగ్ : 2.75/5

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies