'జీ తెలుగు' తమ వీక్షకులకు నాన్-స్టాప్ వినోదాన్ని పంచేందుకు గాను, ప్రతిభను గుర్తించి మరియు దాన్ని ప్రోత్సహించేందుకు గాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా పేరుగాంచిన 'జీ నెట్వర్క్' యొక్క ప్రీమియం రియాలిటీ షో -- డాన్స్ ఇండియా డాన్స్ -- ఇప్పుడు తెలుగులో త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ షో ఇప్పటికే పలు భాషలలో నిర్వహింపబడి అద్భుతమైన విజయాన్ని అందుకుని, చిత్రపరిశ్రమకు మంచి టాలెంట్ ను అందించిన విషయం తెలిసిందే. ఐతే, ఈ అవకాశాన్ని తెలుగు ప్రేక్షుకులకు కూడా కల్పించేందుకు, 'జీ తెలుగు' తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ సాంస్కృతిక నేపథ్యం మరియు జీవనశైలి కలిగిన డాన్సర్స్ ను వెతికిపట్టుకునే ప్రయత్నంలో భాగంగా జూన్ 23 నుండి పలు నగరాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తూ వస్తుంది.
ఇందులో భాగంగా, వరంగల్, ఖమ్మం, కర్నూల్, విజయవాడ, తిరుపతి, మరియు వైజాగ్ లో నిర్వహింపబడిన ఆడిషన్స్ కి వందలాది డాన్సర్స్ ఎంతో ఉత్సాహంతో తరలివచ్చారు. క్లాసికల్, ఫోక్, వెస్ట్రన్, ఇలా పలు డాన్స్ ఫార్మ్స్ లో ప్రావిణ్యం కలిగిన అద్భుతమైన డాన్సర్స్ 'జీ తెలుగు' కంటపడ్డారు. ఐతే, ఇప్పుడు ఈ అవకాశం హైదరాబాద్ ప్రజల చెంతకు రానుంది. జూలై 3న ఈ రియాలిటీ షో యొక్క చివరి దశ ఆడిషన్స్ రామానాయుడు స్టూడియోస్ లో జరగనున్నాయి. డాన్స్ మీద ఆసక్తివున్న 6 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వారెవరైనా ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు.
ఆదేవిధంగా, ఆశావహులు డిజిటల్ ఆడిషన్స్ లో కూడా పాల్గొనవచ్చు. మీ యొక్క డాన్స్ వీడియో షూట్ చేసి 9154984009 నెం.కి వాట్సాప్ చేయండి లేదా did.zeetelugu@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీరు didtelugu.zee5.com కు లాగాన్ అవ్వడంద్వారా కూడా మీ వీడియోలను పంపవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment