కిరణ్ అబ్బవరం.. మళ్ళీ ప్రూవ్ చేశాడు!


ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంటెడ్ యువ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో 
కిరణ్ అబ్బవరం ఒకరు. రాజవారు రాణిగారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 

ఆ తరువాత ఎలాంటి సినిమా చేసినా కూడా మనోడి నుంచి మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమా వస్తుందని ప్రేక్షకులలో ఒక నమ్మకం ఏర్పడింది. ఇక ఇప్పుడు సమ్మతమే సినిమా కూడా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో సినిమాకు గట్టిగానే రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తరువాత మళ్ళీ మౌత్ టాక్ ద్వారా జనాలు థియేటర్స్ క్యూ కడుతున్నారు. 

సమ్మతమే థియేటర్స్ చాలా వరకు నిండుగా కళకళలాడుతున్నాయి. డీసెంట్ టాక్ నుంచి రెండవ రోజు నుంచి జనాల్లోకి సినిమా బాగా ఎక్కేసినట్లు అనిపిస్తోంది. ఇక కలెక్షన్స్ అందుకోవడంలో కిరణ్ మరోసారి తన టాలెంట్ ఏంటో చూపించాడు. మొదటి నుంచి చూసుకుంటే ఈసారి నెంబర్లు కొంత పెరిగాయి. చూస్తుంటే సమ్మతమే మంచి ప్రాఫిట్స్ అందుకునేలా ఉందని అనిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post