నయన్ పెళ్లి లొల్లి.. రూ.25కోట్లు నష్టం?


స్టార్ కపుల్ నయనతార విఘ్నేష్ శివన్‌లకి నెట్‌ఫ్లిక్స్ నుండి పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వారికి రూ.25 కోట్లను తిరిగి ఇవ్వమని నోటీసులు పంపిందట. నయనతార మరియు విఘ్నేష్ శివన్ జూన్ 9 న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారు వివాహ కవరేజీ కోసం రూ.25 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు టాక్ వచ్చింది. 

పెళ్లి ఏర్పాట్లకు, స్టేజ్ అలంకరణ నుండి అలాగే అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ సూట్‌ల బుకింగ్ వరకు, మేకప్ నుండి సెక్యూరిటీ వరకు అలాగే ఒక్కో ప్లేట్ ₹3500 ఖరీదు చేసే ఆహారం కోసం కూడా నెట్‌ఫ్లిక్స్ సొంత ఖర్చుతో నయన్ పెళ్లి చేసిందట.  అయితే నయన్-విఘ్నేష్ పెళ్లి జరిగిన నెల తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్ పెళ్లి వీడియోను ప్రసారం చేయలేదు. 

ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ద్వారా డీల్‌ను రద్దు చేయడమే కారణమని తెలుస్తోంది. ముందుగానే దర్శకుడు నెట్ ఫ్లిక్స్ అనుమతి లేకుండా కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఒప్పందం ఉల్లంఘనే నెట్‌ఫ్లిక్స్ డీల్ ను రద్దు చేయడానికి కారణమని తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి, స్ట్రీమింగ్ హక్కులతో సహా పెళ్లికి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని నెట్‌ఫ్లిక్స్ నోటీసులు పంపినట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post