ఐకాన్ కథ ఆ హీరోకు షిఫ్ట్?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నాడు. పుష్ప సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై ఫోకస్ పెట్టిన బన్నీ ఎలాగైనా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ కూడా అంచనాలకు తగ్గట్టుగానే సెకండ్ పార్ట్ కథలో కొన్ని మార్పులు చేస్తున్నాడు.

అయితే బన్నీ ఈ తరుణంలో ఇతర ప్రాజెక్టులపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అసలైతే ఈపాటికే ఐకాన్ సినిమాను పూర్తి చేయాల్సింది. కానీ ఆ సినిమా కథ పాన్ ఇండియా రేంజ్ కు సరిపోదు అని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజు ఆ కథను మరో హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవల యువ రామ్ పోతినేనిని కలిసి ఐకాన్ కథ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందే రామ్, బన్నీ రిజెక్ట్ చేసిన ది వారియర్ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అతను వద్దని చెప్పిన కథలో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post