అగ్ర హీరోకు ఎదురుతిరగబోతున్న సమంత?


టాలెంటెడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాతో పాటు యశోద, శాకుంతలం సినిమాలో కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ క్రమంలో తమిళ్ అగ్ర హీరో విజయ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 67వ సినిమా చేయబోతున్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ సినిమాలో విజయ్ కు ఎదురుగా నిలబడే ఒక పవర్ఫుల్ ఉమెన్ గా సమంత కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కేవలం సమంతకు చిన్న స్టోరీ లైన్ చెప్పగానే ఒప్పేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ పూర్తిగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మరోసారి చర్చలు సక్సెస్ అయితే త్వరలోనే విజయ్ సమంత ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post