బింబిసార సెన్సార్ రిపోర్ట్ అండ్ రన్ టైమ్!


కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని కళ్యాణ్ రామ్ తీరికలేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ ని కూడా పూర్తి చేసుకుంది.

బింబిసార సినిమా 2 గంటల 26 నిమిషాల నిడివితో అలరించనున్నట్లు ఆఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా యాక్షన్ ఫాంటసీ ఫిలిమ్ గా తెరపైకి వస్తుండడంతో సినిమాకు U/A సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక సెన్సార్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మేజర్ గా కళ్యాణ్ రామ్ నటన హైలెట్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండు కాలాలకు సంబంధించిన ప్యార్లేల్ కథలను దర్శకుడు వశిష్ట చాలా చక్కగా ప్రజెంట్ చేసినట్లు చెబుతున్నారు.

అలాగే ఒక కాలంలో ఉండే బింబిసార వెంటనే ప్రస్తుత కాలానికి వస్తే ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే ఒక ఎమోషనల్ మూమెంట్ తో అతను ఏ విధంగా మారతాడు అనేది ఈ సినిమాలో అసలు కథ.. ఇక సినిమాలో బింబిసార రాక్షసత్వం ఊహించని విధంగా ఉంటుంది అని సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో కూడా సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు. మరి సినిమా ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post