థాంక్ యూ.. టికెట్ల రేట్లల్లో మళ్ళీ మోసం?


దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మించిన థాంక్యూ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా నాగచైతన్య జంటగా నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి సినిమాకు బలమైన ఓపెనింగ్స్ అందుతాయి అనేది పెద్ద సందేహంగానే ఉంది. 

అయితే రీసెంట్గా సినిమా టికెట్లు రేట్లు సాధారణ రేట్లలోనే ఉంటాయ్ అంటూ చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించగా ప్రస్తుతం ఆన్ లైన్ లో చూస్తే మాత్రం మళ్లీ ఎప్పటిలానే టికెట్ల రేట్లు మండిపోతున్నాయి. ఏదో అక్కడక్కడ కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో తప్పితే మల్టీప్లెక్స్ లో టికెట్ల రేట్లు రెండు వందల యాభై రూపాయల లో కూడా ఉండడం విశేషం. అసలే సినిమాకు పెద్దగా బజ్ లేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా టికెట్ల రేట్లు కొనసాగితే ఆడియన్స్ ఎంతవరకు ఆసక్తి చూపిస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post