ఆజ్ఞతవాసి, సాహో.. మరో వారసుడు!


అజ్ఞాతవాసి సాహో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ రెండు సినిమా కథలపై కాఫీ వివాదం కూడా గట్టిగానే నడిచింది. ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీ లార్గో విచ్ కథను ఆధారంగా చేసుకుని సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లు అప్పట్లో చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఆ సినిమా దర్శకుడు కూడా అదే తరహాలో కామెంట్ చేశాడు.

అయితే ఇప్పుడు రాబోయే వారసుడు సినిమా కూడా అదే తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి విజయ్ తో చేస్తున్న బైల్యాంగిల్ మూవీ వారిసు తెలుగులో వారసుడిగా రాబోతోంది. అయితే ఈ కథ మెయిన్ ఫ్లోట్ అయితే ఆ కథనుంచే తీసుకున్నట్లుగా వంశీ ముందుగానే హీరోకు చెప్పాడట. అయితే అతని స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్న విధానం మాత్రం బాగా నచ్చడంతో విజయ్ టెంప్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి ఎప్పటిలానే తన ప్లానింగ్ తో సినిమాను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post