లవ్ లెటర్ తో దెబ్బలు తిన్న సాయి పల్లవి!


మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల విరాటపర్వం సినిమాతో మంచి నటిగా గుర్తించినందుకున్న విషయం తెలిసిందే ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ ఓటీటీ లో మాత్రం మంచి క్రేజ్ అందుకుంటోంది. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ సందర్భంగా ఇటీవల చిత్ర యూనిట్ ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసింది.

అయితే గంగవ్వ తో నిర్వహించిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన ఏడవ తరగతి లవ్ లెటర్ గురించి కూడా చెప్పింది. నిజ జీవితంలో తాను స్కూల్ డేస్ లో ఉండగానే ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను అని అయితే ఆ లవ్ లెటర్ పేరెంట్స్ కి దొరకడంతో చితక బాధినట్లు సాయి పల్లవి ఓపెన్ గా తెలియజేసింది. ఇక విరాటపర్వంలో సాయి పల్లవి మంచి గుర్తింపు అందుకున్నా కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నష్టాలను కలుగజేసింది. ఇక నెట్ ఫ్లిక్స్ లో మాత్రం జూలై 1 నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తొలిరోజే ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది
.

Post a Comment

Previous Post Next Post