పుష్ప బడ్జెట్... బన్నీ రేటెంతంటే?


పుష్ప సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇక సెకండ్ పార్ట్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే పవర్ఫుల్ స్క్రిప్ట్ తో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా బడ్జెట్ లో లిమిట్ లేకుండా ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో సినిమా కోసం దాదాపు 300 నుంచి 350 కోట్ల మధ్యలో ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే అందులో అల్లు అర్జున్ పారితోషికం 100 కోట్లు వరకు ఉండబోతున్నట్లుగా టాక్. ఈ లెక్కలను బట్టి చూస్తే సినిమాకు సంబంధించిన బిజినెస్ 500 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంది. నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ అందుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి సినిమా థియేట్రికల్ గా ఎంతవరకు ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి. సినిమా రెగ్యులర్ షూట్ ను ఆగస్టు నెలలో స్టార్ట్ చేసి 2023 సమ్మర్ అనంతరం లేదా 2024లో మొదట్లో రావచ్చని సమాచారం.

Post a Comment

Previous Post Next Post