రాజమౌళితో నెట్ ఫ్లిక్స్ బేరాలు!


కరోనా టైమ్ లో నెట్ ఫ్లిక్స్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా జనాలు ఆసక్తి చూపడంతో ఆ సంస్థ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంది. ఆ తర్వాత రేట్లు భారీగా పెరగడంతో  మిగతా ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా మంచి కంటెంట్ ఇస్తూ ఉండడంతో నెట్ ఫ్లిక్స్ పై జనాల ఫోకస్ తగ్గింది.

ఈ తరుణంలో చాలావరకు నెట్ ఫ్లిక్స్ కు రేట్లు తగ్గించక తప్పలేదు. ప్రస్తుతం ఆ సంస్థ నష్టాల్లో కొనసాగుతున్న తరుణంలో RRR సినిమా ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా బూస్ట్ అయితే ఇచ్చింది. అయితే ఇదే మంచి అవకాశం అని రాజమౌళితో ఆ సంస్థ బేరాలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. మంచి కంటెంట్ తో స్క్రిప్ట్ ప్లానింగ్ లో సహాయం చేయవలసిందిగా ఆ సంస్థ నుంచి భారీ స్థాయిలో బేరాలు జరుగుతున్నాయట. రాజమౌళి తన ప్రాజెక్టుల్లో కొన్నింటిని నెట్ ఫ్లిక్స్ తో అనుసంధానం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆయన డైరెక్ట్ చేసే అవకాశం లేదని సమాచారం.

Post a Comment

Previous Post Next Post