రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. దీంతో సినిమాకి సంబంధించిన లాస్ట్ మినిట్ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ అయ్యాయి.
పీరియాడికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో రవితేజ సివిల్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇక సినిమా ఎలా ఉంది అనే టాక్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లో ఒక కేసు వివాదంలో రవితేజ సాక్ష్యాలు లేకపోయినా కూడా విలన్స్ ను ఎలా ఎదుర్కొన్నాడు అలాగే తన పవర్ లేకుండా వారికి ఎలా బుద్ధి చెప్పాడు అనే పాయింట్ తో కొనసాగుతుందట.
సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా కానున్నట్లు చెబుతున్నారు. ఇక సాంగ్స్ అంతగా వర్కౌట్ కాకపోయినప్పటికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నట్లు టాక్. ల్యాగ్ లేకుండా స్పీడ్ గా వెళ్లే ఈ థ్రిల్లింగ్ కథ మాస్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకోవచ్చని చెబుతున్నారు. మరి సినిమా అనుకున్నట్లే జనాలను మెప్పిస్తుందో లేదో చూడాలి.
Follow
Post a Comment