ఓ మై గాడ్ ఇది నిజం కాదు.. ఉపాసన దండం!


మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదెల ఇటీవల పిల్లల విషయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురును ఒక ప్రశ్న అడిగిన విషయం తెలిసిందే. మేము పిల్లలను కనె విషయంలో జనాలు నిత్యం చర్చించుకునే ఉంటారు అని అడిగారు. ముందుగా పిల్లలు కనలేని వారికి నేను బహుమతులు ఇస్తానని ఇప్పటికే జనాభా చాలా పెరిగిపోయింది అని ఇక అవసరం లేదు అని సద్గురు అప్పుడు ఉపాసనకు తెలియజేశారు.

అయితే ఆ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంటే ఉపాసన పిల్లలు కనేందుకు ఆసక్తి చూపడం లేదు అని ఇక మెగా వారసులు ఉండరు అని కొంతమంది వార్తలు కూడా ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్పందించిన ఉపాసన ఓ మై గాడ్ ఇది నిజం కాదు అంటూ.. అసలు ఆ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అని దండం పెడుతున్న ఎమోజిని పోస్ట్ చేశారు. కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే అడిగినట్లు ఉపాసన తన వైపు నుంచి ఒక వివరణ అయితే ఇచ్చింది. అంటే వారు సంతానం విషయంలో అలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆమె ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post